మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (16:55 IST)

అశోకగజపతి రాజుకు ఏపీ హైకోర్టులో ఊరట

ashoka gajapathi raju
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి రాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. చెన్నైలో కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలో ఆయన భూమికి సంబంధించిన దస్త్రాలను తీసుకుని రావాలంటూ ఈడీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. 
 
ఈయన చెన్నై మైలాపూర్‌లో 37,092 చదరపుటడుగుల భూమికి సంబంధించి ఈడీ అధికారులు దస్త్రాలను తీసుకుని స్వయంగా తమ వద్దకు రావాలంటూ గతంలో ఈడీ అధికారులు నోటీసులు జారీచేశారు. వీటిపై అశోకగజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈడీ అసిస్టెండ్ డైరెక్టర్ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. 
 
అంతేకాకుండా, ఏ వివరాల ఆధారంగా అశోక గజపతిరాజు, ఆయన సోదరి రాజా వాసిరెడ్డి సునీత ప్రసాద్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును నమోదు చేశారని ఈడీని ప్రశ్నిస్తూ నోటీసులు జారీచేసింది.