గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (15:53 IST)

మేకప్ వేసుకుని అన్నీ అబద్దాలే చెప్పారు - ఒసేయ్ అనలేమా వాసిరెడ్డి పద్మా!

bonda uma
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వర రావు తీవ్ర స్థాయిలో మండిప్డడారు. విజయవాడ ఆస్పత్రి గ్యాంగ్ రేప్ బాధితురాలిని పరామర్శించేందుకు మూడు రోజుల తర్వాత మేకప్ వేసుకుని వచ్చి అన్నీ అబద్ధాలే చెప్పారంటూ మండిపడ్డారు. 
 
ఆమె ఒక రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గాకాకుండా, ఒక బజారు మనిషిలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆమె ఒరేయ్ అంటే... తాము ఒసేయ్ అనలేమా? అని బొండా ఉమ ప్రశ్నించారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన తమ అధినేత చంద్రబాబుకు కేవలం రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చారన్నారు. 
 
వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి నుంచి తొలగించే వరకు తాము న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. అత్యాచార బాధితురాలి అండగా ఉండటమే తమ అధినేత చంద్రబాబు చేసిన తప్పా అని ప్రశ్నించారు.