1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. SC, ST Case registerd on TDP Leader Chintamaneni Prabhakar

టీడీపీ నేత చింతమనేనిపై ఎస్సీఎస్టీ వేధింపుల కేసు

chintamaneni prabhakar
టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం, ప్రగడవరం పంచాయతీ పరిధిలోని అంకంపాలెంలో సోమవారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన అనేక చార్జీలను ఎత్తి చూపుతూ, "బాదుడే బాదుడు" కార్యక్రమం నిర్వహించింది. 
 
ఇందులో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ ఏపీలోని వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తమ గ్రామంలో తమ పార్టీ అధినేతను టీడీపీ నేతలు విమర్శించడాన్ని సహించలేని వైకాపా నేతలు టీడీపీ నేతలపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీనిపై గ్రామ సర్పంచ్ తొమ్మండ్రు భూపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు చింతమనేని ప్రభాకర్‍‌పై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేశారు. 
 
మరోవైపు, టీడీపీ నేతలు కూడా వైకాపా నేతలపై ఫిర్యాదులు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై సర్పంచ్ భూపతి, ఉప సర్పంచ్ రమేష్ రెడ్డి, మరో ఐదుగురు దాడి చేశారని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ నేత రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో వైకాపా నేతలపై కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. 
తర్వాతి కథనం
తమిళనాడులో ఘోరం - రథోత్సవంలో అపశృతి - 11 మంది మృతి