మంగళవారం, 23 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (22:20 IST)

3వ సంఖ్య జాతకులు ఎవరు? ఎలా వుంటారు? (video)

Three number
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీలలో జన్మించినవారిని మూడవ అంకె జాతకులు అంటారు. వీరు గురుగ్రహస్య వ్యక్తులని పిలుస్తారు. ఆకర్షణీయమైన ఆరోగ్యవంతమైన దేహంతో అలరారుతూ వుంటారు. స్వతంత్ర జీవనం వీరికి ఇష్టం.

 
పలు విధాలైన విద్యలలో కళలలో ప్రావీణ్యం కలిగి వుంటారు. జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు రాగలవు. ధన విషయంలో తృప్తికరమైన పరిస్థితులలో కాలం గడుపుతారు.

 
8వ సంఖ్య జాతుకులు ఎలా వుంటారంటే..?
ఏ నెలలో అయినాసరే 8, 17, 26 తేదీలలో పుట్టిన వారిని ఎనిమిదవ అంకె జాతకులని అంటారు. వీరిని శనిగ్రహ వ్యక్తులని పిలుస్తారు. పొట్టిగా చామనఛాయ శరీరమును కలిగి వుంటారు.

 
బద్ధకంతో ఏ పనిని చేయరు. పెద్దలమాటలను కూడా లక్ష్యపెట్టనివారుగా వుంటారు. కుటుంబ పరిస్థితులు ఎలా వున్నా పట్టించుకోరు. ఇతరులకు ఉపకారం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. స్వార్థాన్ని ప్రదర్శిస్తారు.