శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (13:36 IST)

వైశాఖ శని అమావాస్య.. ఇలా చేస్తే ఆ దోషాలు పరార్

Lord Shani
వైశాఖ మాసంలో శనివారం వచ్చే అమావాస్యకు విశిష్టత వుంది. ఈసారి అమావాస్య ఏప్రిల్ 30వ తేదీ శనివారం వస్తోందని, దీనిని శని అమావాస్యగా పిలవడం జరిగింది. అయితే, శని అమావాస్య రోజున జ్యోతిష్యశాస్త్రం పరంగా కొన్ని నివారణ చర్యలు చేపట్టడం ద్వారా శని దేవుని అనుగ్రహం పొందవచ్చు. 
 
ఇంకా ఈ శనివారం అమావాస్య రావడంతో పక్షి, ఇతర దోషాలను తొలగించడానికి ప్రత్యేక పూజలు, దాన కార్యక్రమాలు చేస్తుంటారు. వైశాఖంలో వచ్చే శని అమావాస్య ఏప్రిల్ 29 రాత్రి 12.57 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఏప్రిల్ 30 ఆలస్యంగా మధ్యాహ్నం 1:57 గంటల వరకు కొనసాగుతుంది.  
 
ఈ రోజున శనిదోషాల నుంచి విముక్తి పొందాలంటే.. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం స్నానం చేసిన తరువాత రావి చెట్టు వద్ద పూజలు చేయాలి. అలాగే ఆలయంలో శని చాలీసాను పఠించాలి. ఆ రోజు బెల్లంతో చేసిన పదార్థాలను దానం చేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని తొలగించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.