బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (10:20 IST)

దేశంలో కరోనా అప్‌డైట్స్... వివరాలు ఇవే

coronavirus
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 2593 పాజిటివ్ కేసులు నమోదైనట్టు పేర్కొంది. 
 
ప్రస్తుతం ఈ కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా హోం క్వారంటైన్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 15873కు చేరుకుంది. అదేవిధంగా గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1755గా ఉంది. ఈ సంఖ్యతో కలుపుకుంటే మొత్తం 4,25,19,479 మంది కోలుకున్నారు. 
 
అలాగే, గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 44 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,22,193కు చేరుకుంమది. అలాగే, 1905374 మందికి శనివారం వ్యాక్సిన్లు వేశారు.