1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (10:21 IST)

దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో 2,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 13,433 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్ తీసుకుంటున్నారని తెలిపారు. 
 
అదేవిధంగా కరోనా నుంచి 1,231 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య మొత్తం 4,25,14,479గా ఉందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 56 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన ఓ బులిటెన్‌లో పేర్కొంది.