మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (17:24 IST)

మిస్ ఇండియా 2022 పోటీల్లో దొరసాని

shivani
మిస్ ఇండియా 2022 పోటీల్లో.. సినీ నటుడు రాజశేఖర్, నటి జీవితల పెద్ద కుమార్తె శివాని పాల్గొనబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. 
 
'అద్భుతం' సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి శివాని ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె రెండు తమిళ చిత్రాలు, 'అహ నా పెళ్లంట' అనే తెలుగు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.
 
ఈ నేపథ్యంలో మిస్ ఇండియాలో పాలు పంచుకోనున్నానని.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని, అందరి ఆశీర్వాదాలు కావాలని కోరింది. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫెమీనా సంస్థకు ధన్యవాదాలు తెలిపింది. 
 
ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్న మహిళలకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. పోటీలకు సంబంధించి నిన్న ఆడిషన్స్ కు హాజరైనట్టు తెలిపింది. తన వంతుగా ఉత్తమ ప్రదర్శనను ఇచ్చానని చెప్పింది. అందాల పోటీల్లో పోటీ పడుతున్న శివానికి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.