గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (11:26 IST)

నెగెటివ్ టాక్‌లోనూ మంచి కలెక్షన్లు రాబడుతున్న "బీస్ట్"

beast
తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం బీస్ట్. ఈ చిత్రం ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది. అయితే, ఈ చిత్రం విడుదలైన తొలి ఆటతోనే నెగెటివ్ టాక్ వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం బోల్తా కొట్టిందన్న ప్రచారం జరిగింది. 
 
అయితే, టాక్‌తో పని లేకుండా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతోంది. గత ఆరు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లను పరిశీలిస్తే, ఒక్క తమిళనాడులోనే రూ.51.05 కోట్ల షేర్‌ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.6.98 కోట్ల షేర్‌ను, కర్ణాటకలో రూ.6.14 కోట్ల షేర్‌ను, కేరళలో రూ.4.63 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మాత్రం రూ.26.65 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.97 కోట్ల షేర్ సాధించింది.
 
అయితే, ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే మరో రూ.32 కోట్ల షేర్‌ను రాబట్టాల్సివుంది. 'బీస్ట్' కథాకథనాల్లోని లోపంతో ఈ సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. అదేసమయంలో 'కేజీఎఫ్ 2' ప్రభావం బీస్ట్‌పై తీవ్రంగా ఉంది. 'రాధే శ్యామ్' తర్వాత వచ్చిన 'బీస్ట్' కూడా పూజ హెగ్డేను నిరాశపరిచి, అసంతృప్తికి గురిచేసింది.