గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (17:39 IST)

'బాహుబలి-2' రికార్డును బద్ధలు కొట్టిన రాకింగ్ స్టార్

KGFChapter2Teaser
రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం "కేజీఎఫ్-2". ఈ చిత్రం "బాహుబలి-2" రికార్డును బద్ధలు కొట్టింది. బాలీవుడ్‌లో సైతం సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇందులోభాగంగా, కేవలం ఐదు రోజుల్లో ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇందులో ఒక్క హిందీలోనే ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్లు ఉండటం గమనార్హం. 
 
గతంలో వచ్చిన "బాహుబలి-2"కి రూ.200 కోట్ల కలెక్షన్లు చేరుకునేందుకు ఏకంగా ఆరు రోజుల సమయం పట్టింది. ఇపుడు "కేజీఎఫ్-2" కేవలం ఐదు రోజుల్లోనే ఈ రికార్డును బీట్ చేసింది. దీంతో అతి తక్కువ రోజుల్లో రూ.200 కోట్లు వసూలు చేసిన చిత్రంంగా "కేసీఆర్-2" సరికొత్త రికార్డును నెలకొల్పింది.
 
అదేసమయంలో తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లో ఏకంగా 28 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ సరసన శ్రీనిధి శెట్టి నటించగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబాలే పతాకంపై నిర్మించారు.