శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (20:28 IST)

"బీస్ట్"లో ప్రేక్షకురాలిగా మిగిలిపోయిన 'బుట్టబొమ్మ' (video)

pooja hegde
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ నటించిన తాజా చిత్రం "బీస్ట్". నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ నెల 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ చిత్రం నెగెటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను తీవ్ర నిరాశకు లోనుచేసింది. పైగా, ఈ చిత్రంలో హీరో విజయ్, కమెడియన్ యోగిబాబుల హాస్యాన్ని చూస్తూ ఓ ప్రేక్షకురాలిగా ఉండిపోయింది. దీనికి కారణం ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడమే. 
 
నిజానికి 'బీస్ట్' కంటే ముందు ప్రభాస్‌తో కలిసి నటించి 'రాధేశ్యామ్' వచ్చింది. ఇది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీంతో 'బీస్ట్‌'పై పూజాహెగ్డే భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రం కూడా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పైగా, ఇందులో చాలా గ్లామరస్‌గా కనిపించారు.
pooja hegde
 
అయితే, హీరో విజయ్ చేసే యాక్షన్, కమెడియన్స్ చేసే కామెడీని చూస్తుండటం మినహా ఆమె ఏమీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో 'ఈ మాత్రం పాత్ర కోసమేనా పూజా హెగ్డే ఇంత హడావుడి చేసింది? ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పూజ చేసిన సందడి చూసి ఆమె పాత్ర గురించి ఏవేవో ఊహించుకున్నాం" అంటూ నెటిజన్స్ ట్రోల్స్ మొదలుపెట్టారు.