ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (20:00 IST)

బీస్ట్ సినిమా బాగోలేదు.. స్క్రీన్‌కు నిప్పెట్టిన విజయ్ ఫ్యాన్స్!

Arabic Kuthu
బీస్ట్ సినిమాపై విజయ్ అభిమానులు ఫైర్ అయ్యారు. అంతేగాకుండా.. ఆ సినిమా నచ్చలేదని ఏకంగా థియేటర్‌కే నిప్పు పెట్టారు. సినిమా నచ్చలేదని స్క్రీన్‌ను తగలబెట్టిన ఘటన తమిళనాడులోని ఒక థియేటర్లలో వెలుగుచూసింది.
 
వివరాల్లోకి వెళితే.. హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ సినిమా బుధవారం తెరపైకి వచ్చింది. ఈ సినిమాపై  భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్లకు వెళ్లిన అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. 
 
సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ అభిమానాలు ఆగ్రహంతో ఊగిపోయారు. సినిమా మధ్యలోనే స్క్రీన్ కు నిప్పంటించారు. స్క్రీన్‌ని తగలబడడం చూసిన యాజమాన్యం వెంటనే సినిమాను ఆపి మంటలను వ్యాప్తి కాకుండా అదుపుచేశారు. ఇక ఈ ఘటనకు సంబధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.