మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (13:23 IST)

కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

yash
రాకీ భాయ్ కేజీఎఫ్ 2తో వచ్చేశాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైంది. గ్రాండ్ విజువల్స్​తో పాటు రాఖీబాయ్​గా యశ్​- అధీరాగ సంజయ్​ దత్​ యాక్షన్స్​ ఎపిసోడ్స్ వేరే లెవల్​లో ఉన్నాయని ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. 
 
ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.
 
అసలు కథేంటీ.. కథనం ఎలా ఉందంటే.. కేజీఎఫ్‌ మొదటి భాగంలో పాత్రల పరిచయం, రాఖీ(యష్‌) కాస్త రాఖీ భాయ్‌గా ఎదిగిన తీరుని చూపించారు. రెండో పార్ట్‌లో రాఖీభాయ్‌ కేజీఎఫ్‌ని తన ఆధీనంలోకి తీసుకుని ఇండియాని శాసించడం చూపించారు. 
 
ఈ క్రమంలో ఆయనతో మరో బలమైన విలన్‌ అధీర(సంజయ్‌ దత్‌), దేశ ప్రధాని(రవీనా టండన్‌) చేసే పోరాటం ప్రధానంగా "కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2" సాగుతుంది.
 
ఇక హీరో ఇంట్రడక్షన్ .. ఇంటర్వెల్ సీన్స్ అయితే గూజ్ బమ్స్ వచ్చేలా ఉన్నాయి. అలాగే రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం అదరిపోయిందని ట్వీట్‌ చేస్తున్నారు నెటిజన్స్. ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటిగా ఈ సినిమా ఉండనున్నట్టు మరికొంత మంది నెటిజన్స్.
 
సినిమాకు యశ్ నటన, బీజీఎం, తల్లి సెంటిమెంట్, యశ్ వర్సెస్ అధీరా సీన్స్, క్లైమాక్స్ ప్లస్‌గా మారాయి. కొంతమంది మాత్రం నెగటివ్​ రివ్యూలు కూడా ఇస్తున్నారు. ఫస్టాప్​ పూనకాలు తెప్పించినా సెకండాఫ్​లో కథ కాస్త నెమ్మదిగా సాగిందని ట్వీట్లు చేస్తున్నారు. మొత్తానికి సినిమాకి ట్విట్టర్‌ ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన వస్తుంది.
 
రేటింగ్.. 3.5/5