సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (15:12 IST)

KGFChapter2 నుంచి ఎదగరా సాంగ్ విడుదల (వీడియో)

Yash
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ స్టార్ యష్ 'కె.జి.యఫ్: చాప్టర్ 1'కు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాఫ్టర్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి తాజాగా  'ఎదగరా... ఎదగరా...' అంటూ సాగే పాట విడుదలైంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. సుచేత బస్రూర్ ఈ పాటను ఆలపించడం విశేషం.
 
ఇకపోతే, కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి విజయ్ కిరగందూర్ నిర్మాత. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి 
 
'ఎదగరా... ఎదగరా... దినకరా... 
జగతికే జ్యోతిగా నిలవరా...
పడమర నిశీధిరా... వాలనీ
చరితగా ఘనతగా వెలగరా అని సాగే పాట విడుదలైంది. ఈ లిరికల్ పాట వీడియోను లుక్కేయండి.