శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (13:04 IST)

కార్తీకదీపం వంటలక్క ఉద్యోగ ప్రకటన.. డ్రైవర్లు కావాలట!

karthika deepam
కార్తీకదీపం సీరియల్ వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్లు బాగా క్రేజ్ తీసుకొచ్చాయి. ఇక వంటలక్క పాత్రను కేరళకు చెందిన ప్రేమీ విశ్వనాథ్, డాక్టర్ బాబు క్యారెక్టర్‌‌ను నిరుపమ్ పోషించారు. 
 
అయితే, ఈ సీరియల్‌లో ఇటీవలే ఈ రెండు పాత్రలు రోడ్డు ప్రమాదంలో చనిపోయాయి. దీంతో, టాప్ రేటింగ్‌లో కొనసాగిన ఈ సీరియల్... ఇప్పుడు కాస్త వెనుకబడిపోయింది. 
 
ఈ సీరియల్ గురించి పక్కన పెడితే... ప్రేమీ విశ్వనాథ్ ఒక ఉద్యోగ ప్రకటనను ఇచ్చింది. ఫేస్ బుక్ లో ఈ ప్రకటనను పోస్ట్ చేసింది. 
 
'అన్ని రకాల ఫోర్ వీలర్ (ఆటోమేటిక్, మాన్యువల్) డ్రైవర్లు కావలెను' అని ఆమె పేర్కొంది. దీనికి తోడు ట్యాలీలో రెండేళ్ల అనుభవం ఉన్న అకౌంటెంట్ కావాలని చెప్పారు. ఎంపికైన వారు కొచ్చిలోని ఎర్నాకులంలో పని చేయాల్సి ఉంటుంది.