గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (19:59 IST)

కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి.. చంద్రదర్శనం ఆ రోజు చేసుకుని..?

కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ నక్షత్ర గమనం ప్రకారం కూడా.. గురువారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది.. ఆ విధంగా పౌర్ణమి తిధితో, కృత్తిక నక్షత్రం, శుక్రవారం తెల్లవారుజామున 4.29 వరకు మాత్రమే జత కూడి ఉంటుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 18వ తేదీన గురువారం రాత్రి మాత్రమే జరుపుకుని తీరాలి.
 
మరుసటి రోజు అంటే శుక్రవారం రాత్రికి జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు. కృష్ణపక్షం వచ్చేస్తుంది. కొంతమేర, సౌలభ్యత కోసం చెప్పుకోవాలంటే…. ఉపవాస నియమం ఉన్నా, ఉండాలనుకునే వారు మాత్రం 18వ తేదీ ఉపవాస నియమాలు పాటించి రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని, చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు. ఉపవాస నియమం లేని వారు దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు 18వ తేదీ రాత్రి లేదా 19వ తేదీ ఉదయం 4.30 గంటల లోపు అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించు కోవచ్చు.
 
19వ తేదీ శుక్రవారం కూడాను….మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది. కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునేవారికి మాత్రం 19వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చును. అదేవిధంగా నోములు, తోరాలు ఉన్నవారు కూడా 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. పౌర్ణమి తిధి ఉంటుంది కాబట్టి.. 18వ తేదీ గురువారం సాయంత్రం కూడా నోములు, వ్రతాలు చేసుకోవచ్చు ఆక్షేపణ లేదు. పెద్దగా ఇందులో సందేహించాల్సిన పని లేదు. మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి. తద్వారా చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా భగవంతునికి ప్రీతిపాత్రమే. నిరంతర నామస్మరణతో సర్వేశ్వరుడు మన వెన్నంటే ఉంటారని జ్యోతిష పండితులు తెలిపారు.