గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (14:25 IST)

డిసెంబ‌ర్‌లో కత్రినాకైఫ్ పెళ్లి ఫిక్స్ అయింది!

Katrina - Vicky family
బాలీవుడ్ న‌టి కత్రినాకైఫ్ పెళ్లి ఎట్ట‌కేల‌కు జ‌ర‌గ‌నుంది. గ‌తంలో ప‌లువురు హీరోల‌తో కైఫ్ పెండ్లి చేసుకోబోతున్నద‌న్న వార్త ఎట్ట‌కేల‌కు ఈ దీపావ‌ళికి నెర‌వేరింది. నటుడు విక్కీకౌశల్‌తో వివాహం జ‌ర‌గ‌నుంది. పెండ్లికి ముందు జ‌రిగే రోకా వేడుక కత్రినా  ఆప్తుడైన దర్శకుడు కబీర్‌ఖాన్‌ నివాసంలో జరిగిందని బాలీవుడ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. ఈ వేడుకలో కత్రినా తల్లి సుజానే టర్కోయెట్‌, సోదరి ఇసాబెల్‌ పాల్గొన్నారు. అలాగే విక్కీ తల్లిదండ్రులతోపాటు, సోదరుడు సన్నీ కౌశల్‌ పాల్గొని వివాహానికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని తెలిసింది.
 
డిసెంబర్‌లో జరగనున్న వారి వివాహానికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ట‌. త్వ‌ర‌లో వీటి గురించి మ‌రిన్ని వివ‌రాల‌ను ఈ కొత్త జంట తెలియ‌జేయ‌నున్నార‌ని తెలుస్తోంది. గ‌త కొంత‌కాలంగా ఈ జంట ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో వారి ప్రేమను వ్యక్తపరచారు కూడా. ఇక త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే ఆల‌స్యం. వీరి వివాహానికి రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ వేడుక కానుందని  తెలుస్తోంది.