శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (11:19 IST)

బిగ్ బాస్ షోకు సల్మాన్ పుచ్చుకునే పారితోషికం ఎంతో తెలుసా?

బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ భాగ్ బిగ్ బాస్ షో కోసం భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడని తెలిసింది. త్వరలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ సీజన్ 15కు ఈయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షో కోసం ఈయన భారీగా పారితోషికం అందుకోబోతున్నట్టు సమాచారం. ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ షో.. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా మంచి సక్సెస్ సాధించింది. 
 
హిందీలో ఇప్పటి వరకు బిగ్‌బాస్ రియాలిటీ షో 14 సీజన్లు పూర్తి చేసుకుంది. 15వ సీజన్ కోసం ఇప్పటి నుంచే ప్రిపేరేషన్స్ మొదలైయ్యాయి. ప్రతి సీజన్‌లో సల్మాన్ ఖాన్ తన రెమ్యుననరేషన్ పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా 15వ సీజన్‌కు సల్మాన్ ఖాన్ మరోసారి హోస్ట్ చేయబోతున్నారు. ఈ బిగ్‌బాస్ షో సీజన్ 15లో ఒక్కో ఎసిపోడ్‌కు సల్మాన్ ఖాన్.. రూ.16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 
  
అంటే సల్మాన్ ఖాన్.. ప్రతి వారం వీకెండ్ శని, ఆదివారాలు ఎపిసోడ్‌లో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు. ఈ లెక్కన 100 రోజల్లో 14 వారాలు అంటే 28 నుంచి 30 రోజులు సల్మాన్ ఖాన్.. బిగ్‌బాస్ ఎసిపోడ్‌లో కనిపిస్తాడు. ఈ లెక్కన మొత్తం బిగ్‌బాస్ 14 సీజన్ కోసం సల్మాన్ ఖాన్.. రూ. 450 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు పారితోషకం అందుకునే అవకాశాలున్నాయి.