శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (11:58 IST)

కాటమరాయుడు రీమేక్.. సల్మాన్ సరసన పూజా హెగ్డే.. 'భాయిజాన్‌'..?

Salman -Pooja Hegde
సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'కభీ ఈద్‌.. కభీ దివాళి'. పూజా హేగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫర్హాన్‌ సామ్‌జీ దర్శకుడు. ఈద్‌ పండగ నేపథ్యంలో తన సినిమాలను రిలీజ్‌ చేయటమనేది సల్మాన్‌కి మొదట్నుంచి ఆనవాయితీ. ఇదే పంథాలో ప్రస్తుతం నటిస్తున్న ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది ఈద్‌కి రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో సినిమాకి పెట్టిన టైటిల్‌ యాప్ట్‌ కాదనే ఉద్దేశంతో 'భాయిజాన్‌' అనే టైటిల్‌ని పెట్టాలనే యోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. కథానుగుణంగా 'భాయి జాన్‌' టైటిల్‌ సరిగ్గా సరిపోతుందని సల్మాన్‌ కూడా భావిస్తున్నారట. దీంతో టైటిల్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నారు. తమిళంలో అజిత్‌ హీరోగా సంచలన విజయం సాధించిన 'వీరమ్‌' సినిమా రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదే చిత్రాన్ని తెలుగులో పవన్‌కళ్యాణ్‌ కథానాయకుడిగా 'కాటమరాయుడు'గా రీమేక్‌ చేశారు. నలుగురు తమ్ముళ్ళకు అన్నగా పవన్‌కళ్యాణ్‌ నటించారు. 
 
తెలుగునాట ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. అయితే తొలిసారి ఈ తరహా కథ, పాత్రతో సల్మాన్‌ ప్రేక్షకుల ముందుకి రాబోతుండటం విశేషం. ఈ ఏడాది ఈద్‌ సమయానికి థియేటర్లు మూతపడినప్పటికీ ఓటీటీ వేదిక సల్మాన్‌ 'రాధే' చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. ఈ సినిమాతో పాటు సల్మాన్‌ 'అంతిమ్‌', 'టైగర్‌-3', 'కిక్‌-2' చిత్రాల్లో నటిస్తున్నారు.
 
'భాయిజాన్‌' సినిమాతోపాటు పూజా హెగ్డే 'సర్కస్‌' వంటి బాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే తమిళంలో విజరు సరసన ఓ చిత్రంలోను, ప్రభాస్‌తో 'రాధేశ్యామ్‌', అఖిల్‌ సరసన 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌', రామ్‌చరణ్‌కి జోడీగా 'ఆచార్య' వంటి తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ పూజా బిజీగా ఉంది.