గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (20:08 IST)

వంటలక్కకు నచ్చిన వంటలేంటో తెలుసా?

కార్తీకదీపం సీరియల్ ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్‌కు మాత్రం సినిమా హీరోయిన్లను మించిన పాపులారిటీ ఉంది. వంటలక్క టాలెంట్ వల్ల పెద్దపెద్ద స్టార్ హీరోల స్థాయిలో ఈ సీరియల్‌కు టీఆర్పీ రేటింగ్ వస్తుండటం గమనార్హం. సినిమాల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ప్రేమీ విశ్వనాథ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు.
 
రియల్ లైఫ్‌లో ఎంతో అందంగా ఉండే ప్రేమీ విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్‌లో మాత్రం డీగ్లామర్ రోల్‌లో కనిపిస్తున్నారు. తెలుగమ్మాయి కాకపోయినా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు ప్రేమీ విశ్వనాథ్‌ను అభిమానిస్తున్నారు. 
 
సీరియల్‌లో తెగ వంటలు చేసే ప్రేమీ విశ్వనాథ్‌కు రియల్ లైఫ్‌లో మాత్రం వంటలు చేయడం రాదని సమాచారం. ప్రేమీ విశ్వనాథ్ ఎక్కువగా నాన్ వెజ్‌తో చేసిన వంటకాలను ఇష్టపడతారని తెలుస్తోంది. సెట్‌లో ప్రేమీ విశ్వనాథ్ యాక్టివ్ గా ఉంటారని ఆమెతో పని చేస్తున్న సెలబ్రిటీలు చెబుతున్నారు.