గురువారం, 30 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2025 (11:22 IST)

స్నేహితులకు అప్పులు తీసిచ్చి.. వారు తిరిగి చెల్లించకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య.. ఎక్కడ?

Doctor
Doctor
అప్పుల బాధలు తట్టుకోలేక ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. అప్పుగా స్నేహితులకు డబ్బులు తీసిచ్చి వారు తిరిగి చెల్లించకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురైన ఆ డాక్టర్ ఇంజెక్షన్లు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌‌లోని మంకమ్మతోటకు చెందిన డాక్టర్ ఎంపటి శ్రీనివాస్‌(43).. శివారులోని ఎనస్తీషియా డిపార్ట్‌మెంట్‌లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. అతని భార్య విప్లవశ్రీ కూడా డాక్టరే. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నారు. అయితే శ్రీనివాస్‌ వద్ద ఇద్దరు స్నేహితులు అప్పుగా రూ.1.78  కోట్లు తీసుకున్నారు. వీరితో పాటు మరో ముగ్గురు ఆయన పేరు మీద రూ.1.35 కోట్ల బ్యాంకు లోన్ కూడా తీసుకున్నారు. 
 
కానీ టైమ్‌కి వారు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని భార్యతో పంచుకున్నాడు. వారం రోజులుగా మానసిక వేదన, అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఇంజెక్షన్లు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య గమనించి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.