మంగళవారం, 28 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2025 (10:19 IST)

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇకలేరు

Harish Rao Father Passes Away
Harish Rao Father Passes Away
బిఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు.
 
 సత్యనారాయణ స్వగ్రామం కొత్తపల్లి. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని కోకాపేటలోని హరీష్ రావు నివాసానికి తీసుకువచ్చారు. అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సహా అనేక మంది రాజకీయ నాయకులు హరీష్ రావుకు సంతాపం తెలిపారు.
 
మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థింస్తున్నట్లు పేర్కొన్నారు. హరీష్ రావు కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
 
మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతికి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కవిత ప్రకటించారు.