కమల్, మహేష్‌బాబు కాంబినేషన్?
టాలీవుడ్‌లో కాంబినేసన్‌లు మారిపోతున్నాయి. ఒకప్పుడు సోలో హీరోగానే చేసే వారు ఇప్పుడు మరో హీరోతో కలిసి నటించేందుకు ముందుకు వస్తున్నారు. చిన్న హీరోలు కలిసి చేయడం అనేది మామూలే. కానీ అ్రగ నటులు చేయడం విశేషం. తాజాగా ఫిలింనగర్ లో ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. మహేష్‌బాబు, కమల్ హాసన్ కాంబినేషన్‌లో సినిమా సెట్ కాబోతుందని. దానికి మురుగదాస్ దర్శకుడు అని తెలుస్తోంది. ఇప్పటికే మురుగదాస్, మహేష్‌కు ఓ కథను కూడా చెప్పాడట.
ఇప్పటికే మహేష్‌తో “స్పైడర్” సినిమా చేశాడు. అది మహేష్ అభిమానులతోపాటు ప్రేక్షకులను నిరాశపర్చింది. కాగా, ఇప్పుడు చేయబోయే సినిమా రెండు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఇటీవలే కమల్ హాసన్ తో చర్చలు జరిపిన మురుగదాస్, ఇటీవలే మహేష్ ని కూడా కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలో వుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.