1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (12:09 IST)

అక్షయ తృతీయ.. బంగారం, వెండి కొనకపోతే పర్లేదు.. ఇలా చేస్తే?

Akshaya Tritiya 2022
అక్షయ తృతీయ వైశాఖ శుక్ల పక్షం తృతీయ తిథి నాడు (మే 3వ తేదీన) దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. ఈ రోజున చేసే దానాలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఈరోజున కొనే బంగారం, వెండి ఎన్నటికీ తరగదని విశ్వాసం. అందుకే అక్షయ తృతీయ రోజుల దానధర్మాలు చేయడం, బంగారం, వెండి వస్తువులు కొనడం చేస్తుంటారు. 
 
బ్రహ్మదేవుని కుమారుడు అక్షయ కుమారుడు ఈ తేదీన జన్మించాడు. అందుకే వైశాఖ శుక్ల తృతీయ తేదీని అక్షయ తృతీయ అంటారు. గంగా అవతరణ, పరశురామ జయంతి కూడా ఈ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తారు. 
 
అలా వెండి, బంగారం వంటి వస్తువులు కొనాలంటే.. పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తేదీ మే మూడో తేదీన ఉదయం 05:18 నుంచి ప్రారంభమవుతుంది. మే 4 ఉదయం 07:32 వరకు ఉంటుంది. ఈ రోజంతా కొనుగోలు చేయవచ్చు. 
 
అక్షయ తృతీయ రోజు శుభకార్యాలకు చాలా మంచిది. ఆ రోజు కొత్త బట్టలు, ఆభరణాలు, ఇల్లు, కారు వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. 
 
ఒకవేళ అక్షయ తృతీయ నాడు బంగారం కొనేంత స్తోమత లేకపోతే పెద్దగా చింతించాల్సిన పని లేదు. ఆరోజు చక్కగా భగవంతుడికి పూజ చేసి.. భగవంతుడిని స్మరిస్తూ ఉపవాసం చేయాలి. ఉపవాసం అనంతరం సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కలిగి సకల సంపదలు సిద్ధిస్తాయి.