రుద్రాక్షలు అనేక రకాలుగా వుంటాయి. వీటిలో నాగరుద్రాక్ష విభిన్నమైనది. ఈ రుద్రాక్షను ఆదిశేషుడు, నాగరాజు నాగేంద్ర స్వామి రూపంగా భావిస్తారు. ఈ రుద్రాక్షను మంగళవారం నాడు రాహుకాలంలో పూజించాలని చెపుతారు. అంతేకాదు, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగ పంచమి, గ్రహణ సమయాల్లో పూజిస్తే ఎంతో మంచిదని విశ్వాసం. ఈ రుద్రాక్షను పూజించాలనుకునేవారు తొలుత సుబ్రహ్మణ్యస్వామి సహస్రనామ పూజ, అష్టోత్తర నామపూజ, నాగేంద్రస్వామి పూజ చేయించాలి. అంతేకాకుండా శివాలయంలో రుద్రాభిషేకం, రాహుకాలంలో...