గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (22:22 IST)

తెలంగాణలో కొలువుల జాతర-గ్రూప్ 1 నోటిఫికేషన్‌ విడుదల

jobs
తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ తాజాగా విడుదల చేశారు. 
 
తాజాగా విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌తో 503 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. 
 
ఇందులో అత్యధికంగా 91 డీఎస్పీ పోస్టులు ఉండగా మరో 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ పోస్టులు, 42 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఉన్నాయని టిఎస్పీఎస్సీ తమ ప్రకటనలో వెల్లడించింది. గ్రూప్ 1 ఆశావహులు మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.