శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (20:16 IST)

భలే ఆఫర్.. కార్గో సర్వీసు ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్.. సజ్జనార్ ప్రకటన

Sajjanar
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే టీ 24 టికెట్ ద్వారా 24 గంటలపాటు లీటర్ పెట్రోల్ కంటే తక్కువ ధర 100 రూపాయలకే ఆర్టీసీ బస్సుల్లో 24గంటలపాటు హైదరాబాద్‌లో ప్రయాణించే అవకాశం కల్పించారు. 
 
ఈ నేపథ్యంలో కార్గో సర్వీసు ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. 
 
ఆర్టీసీకి సంబంధించిన కార్గో, పార్శిల్ ఛార్జీలపై 25శాతం తగ్గింపు అందుబాటులో ఉంటుంది.ఈ నెల 24 నుంచి మే 3 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
 
ఈ ఆఫర్‌‌లో భాగంగా ఐదు కేజీల వరకు మాత్రమే ఈడిస్కౌంట్ వర్తిస్తుందని సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికులు మరిన్ని వివరాలకు 040-30102829,68153333 నంబర్లను సంప్రదించాలని ట్వీట్ చేశారు సజ్జనార్.