1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (17:06 IST)

టీఎస్ఆర్టీసీ దొంగదెబ్బ : రిజర్వేషన్ చార్జీల పెంపు

tsrtc
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు దొంగదెబ్బ కొట్టింది. ప్రయాణికులపై అదనపు భారం మోపింది. ఇప్పటికే రెండుసార్లు బస్సు చార్జీలు పెంచిన ఆర్టీసీ.. ఇపుడు మరో పిడుగు వేసింది. గుట్టుచప్పుడు కాకుండా రిజర్వేషన్ చార్జీలను పెంచేసింది. అయితే, ఈ పెంపు భారంపై ఆర్టీసి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 
 
ఒక్కో ప్రయాణ టిక్కెట్ రిజర్వేషన్ చార్జీపై రూ.20 నుంచి రూ.30 వరకు పెంచేసింది. ఈ పెంచిన చార్జీలు కూడా తక్షణం అమల్లోకి రానున్నాయి. దీంతో టిక్కెట్ చార్జీలు మరింతగా పెరగనున్నాయి. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ బాదుడు చాలదన్నట్టుగా మరోమారు ఆర్టీసీ చార్జీలు పెరుగుతాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించడంపై ప్రయాణికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నదూరాలకు కూడా టిక్కెట్ చార్జీలను పెంచడంతో ప్రయాణికులు గగ్గోలుపెడుతున్నారు.