సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-04-22 బుధవారం రాశిఫలాలు - గణపతిని పూజించినా మీకు శుభం...

astro4
మేషం :- ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. బంధు మిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. వ్యపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
 
వృషభం :- మార్కెటింగ్ రంగలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. పనులు కొంత మందకొడిగా సాగుతాయి. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది. పత్రికా రంగంలోని వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ముఖ్యలకు బహుమతులు అందజేస్తారు. అందరితో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు.
 
మిథునం :- లక్ష్యసాధనములో నిరంతర కృషి అవసరం. కుటుంబంలో అనుకున్న పనుల ఒక పట్టానపూర్తి కావు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. అనవసరమైన విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి.
 
కర్కాటకం :- ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. గౌరవం లభిస్తుంది. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఊహించని చికాకులెదురవుతాయి.
 
సింహం :- భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కార్యసాధనలో జయం పొందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తాయి. అవివాహితులకు అందిన ఒక సమాచారం వారిని సందిగ్ధంలో పడవేస్తుంది.
 
కన్య :- ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులు రేపటి గురించి ఆందోళన చెందుతారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
 
తుల :- మీ శ్రీమతితో ఏకీభవించలేకపోతారు. ధన వ్యయం అధికమవుతుంది. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసివస్తుంది. క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
వృశ్చికం :- మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయ, కళారంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించండి.
 
ధనస్సు :- మీ మాటతీరు, మన్ననలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం ఎదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబ సమస్యలు సమర్థంగా నిర్వహిస్తారు.
 
మకరం :- హోటల్, క్యాటరింగ్ పనివారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగలస్తులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు వంటివి పెరుగుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. భార్యా, భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. పెద్దల ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం చేపట్టిన పనులు హడావుడిగా ముగిస్తారు.
 
కుంభం :- గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటంమంచిది.
 
మీనం :- మీరు చేసే వృత్తి, ఉద్యోగాలలో మార్పు సంభవించవచ్చు. దంపతుల మధ్య అవగాహన లోపం, చిన్న చిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. దైవకార్యంలో పాల్గొంటారు. ఎల్ఐసీ, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. స్త్రీలకు బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.