శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మే 2022 (14:05 IST)

యూపీలో దారుణం : కట్నం కోసం కడతేర్చారు..

murderer
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్నం కోసం కట్టుకున్న భార్యను కసాయి భర్త హతమార్చారు. కట్నం కోసం అత్త (మృతురాలి తల్లి) ఎందుటే భార్య గొంతుకోసి చంపేశారు. ఈ దారుణం రాష్ట్రంలోని ఘాజీపూర్ జిల్లా సహేరి గ్రామంలో జరిగింది. ఈ నెల 2వ తేదీన ఈ దారుణం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన ఓమహిళతో ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఈయన అత్తమామల భూమిలో తన భార్యకు కూడా వాటా ఇవ్వాలని, అదీ కూడా కట్నం రూపంలో ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అందుకు వారు నిరాకరించారు. దీంతో అత్త భార్యను నెట్టేసి గాయపరిచాడు. 
 
ఆ తర్వాత ఆవశంతో కూరగాయలు తరిగే కత్తితో భార్య గొంతుకోసి ఉసురు తీశాడు. అత్త ఎదుటే దారుణానికి పాల్పడిన నిందితుడు పారిపోయాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసుల కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.