శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మే 2022 (07:24 IST)

శవాలపై పేలాలు ఏరుకునే వైద్యుడు.. సస్పెండ్

call money
ఆర్థిక సమస్యలతో ఉరేసుకున్న వ్యక్తి మృతదేహానికి శవపరీక్ష చేసేందుకు డబ్బులు (లంచం) డిమాండ్ చేసిన వైద్యుడిపై ఏపీ ప్రభుత్వ వైద్యశాఖాధికారులు చర్యలు తీసుకున్నారు. పోస్టు మార్టం చేసేందుకు రూ.16 వేలు డబ్బులు అడిగినందుకు డాక్టర్ బాషాను సస్పెండ్ చేశారు. ఆర్థిక కష్టాలతో తన భర్త ఆత్మహత్య చేసుకుంటే, మళ్లీ పోస్టు మార్టం చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు లంచం డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన మృతుని భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
 
అసలే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఆమెను వైద్యుడు మాటలు మరింతగా బాధపెట్టాయి. పోస్టు మార్టం చేసేందుకు రూ.16 వేలు తక్షణం ఫోన్ పే చేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఆగ్రహించిన ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ లంచగొండి డాక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.