గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జులై 2022 (13:57 IST)

ప్రకృతి మిశ్రాకు అక్రమ సంబంధం.. వెంటపడి మరీ కొట్టింది..

Prakruti
Prakruti
తన భర్తతో నటి ప్రకృతి మిశ్రాకు అక్రమ సంబంధం ఉందంటూ నటుడు భూషణ్ మొహంతీ భార్య తృప్తి సత్పతి వీధికెక్కింది. నటి ప్రకృతి మిశ్రాను చితకబాదింది. నటుడు భూషణ్ మొహంతీ, తృప్తి సత్పతి భార్యాభర్తలు. 
 
ప్రకృతి మిశ్రా ఒడియా చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్. ప్రకృతి మిశ్రా, భూషణ్ మొహందీ ఓ చిత్రంలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత మరింత బలపడింది. 
 
తాజాగా, వారిద్దరూ ఓ కారులో వెళుతున్నారన్న సమాచారంతో తృప్తి సత్పతి వారిని అడ్డుకుంది. కారులో ఉన్న ప్రకృతి మిశ్రాపై దాడి చేసింది. ఆ నటి కారు దిగి పారిపోయే ప్రయత్నం చేసినా వెంటపడి మరీ కొట్టింది.
 
ఓ వైపు ఈ ఉతుకుడు కార్యక్రమం షురూ అవుతుంటే స్థానికులు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు సందడి చేస్తున్నాయి.