శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (17:26 IST)

జాతీయ అవార్డుల వెల్లడి : ఉత్తమ తెలుగు చిత్రం 'కలర్‌ ఫోటో'

surya
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ అవార్డులను శుక్రవారం వెల్లడించింది. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కలర్ ఫోటో' ఎంపికైంది. అలాగే, జాతీయ ఉత్తమ నటులుగా హీరో సూర్య, అజయ్ దేవగణ్‌లు సంయుక్తంగా ఎంపికయ్యారు. 
 
ఈ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్‌ విభాగాల్లో ‘నాట్యం’, ఉత్తమ సంగీత చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. 
 
జాతీయ ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి(సూరారైపోట్రు)ని అవార్డు వరించింది. ఈ ఏడాది మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఎంట్రీకి వచ్చాయి. అలాగే నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ కేటరిగిలో 148 చిత్రాలు (20 భాషల్లో )స్క్రీనింగ్‌ వచ్చినట్లు జ్యూరీ మెంబర్స్‌ తెలిపారు. 
 
ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, ఫీచర్‌ ఫిల్మ్‌ (28 కేటగిరీలు), నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ (22 కేటగిరీలు), బెస్ట్‌ రైటింగ్‌ సెక్షన్‌, మోస్ట్‌ ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు.
 
జాతీయ అవార్డుల విజేతలు వీరే
ఉత్తమ నటుడు:  సూర్య (సూరారై పోట్రు), అజయ్‌ దేవ్‌గణ్‌( తానాజీ)
ఉత్తమ నటి  అపర్ణ బాలమురళి(సూరారై పోట్రు)
ఉత్తమ చిత్రం :సూరారై పోట్రు( సుధాకొంగర)
ఉత్తమ సహాయ నటి:  లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్‌ సిలా పెంగళం)
ఉత్తమ సహాయ నటుడు: బిజూ మేనన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుం)