బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

08-09-2022 గురువారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని ఆరాధించిన శుభం...

Adi sankaracharya
మేషం :- విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్త్రీల అభిప్రాయాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు వృత్తిపరమైన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఊరటకలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి.
 
వృషభం :- ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. రుణాల కోసం అన్వేషిస్తారు. సోదరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. ఉపాధ్యాయులకు కార్యక్రమాలలో ఒత్తిడి అధికమవుతుంది. మీ కుటుంబీకులు మీ మాటా, తీరును వ్యతిరేకిస్తారు.
 
మిథునం :- బాకీలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. గృహానికి సంబంధించిన వస్తువులు అమర్చుకుంటారు. హోటలు తినుబండారు వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది.
 
కర్కాటకం :- స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి పెరుగుతుంది. రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయలో సంతృప్తి కానరాగలదు. దంపతుల మధ్య సఖ్యతా లోపం, పట్టింపులు చోటు చేసుకుంటాయి. పొదుపుపై దృష్టి కేంద్రీకరిస్తారు.
 
సింహం :- వ్యాపార వ్యవహారాల్లో ఖచ్చితంగా మెలగండి. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు.
 
కన్య :- బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళుకువ అవసరం. ఇతరుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. ముఖ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
తుల :- దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అంతగా అనుకూలించవు. స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను తొరగా ముగించుకుంటారు. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికం కాగలవు.
 
వృశ్చికం :- సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళుకువ, ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. కొంతమంది మిమ్మల్ని నిచ్చెనలా వాడుకొని పురోభివృద్ధి పొందుతారు.
 
ధనస్సు :- వీసా, పాస్పోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. స్త్రీలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. ఇతరుల ముందు మీ ఉన్నతిని చాటుకునే యత్నాలు విరమించండి.
 
మకరం :- చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీ కళత్ర వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులనకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రవాణా, మెకానికల్, ఆటోమొబైల్ రంగాల వారికి పురోభివృద్ధి. ముఖ్యుల రాక ఆనందం కలిగిస్తుంది. వాణిజ్య రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.
 
కుంభం :- మిత్రులకిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం అధికంగా శ్రమిస్తారు. ముఖ్యుల రాకపోకలు అధికం కావడం వల్ల మీ కార్యక్రమాలు వాయిదా పడగలవు. పెద్దలతోను, ప్రముఖులతోను సంప్రదింపులలో సంతృప్తి కానరాగలదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసివస్తుంది.
 
మీనం :- ఉద్యోగస్తులు అధికారుల మెప్పు కోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కుంటారు. సినిమా, కళా రంగాల్లో వారికి మార్పులు అనుకూలంగా ఉంటాయి. కోర్టు, వ్యవహారాలు, పాత సమస్యలు పరిష్కార మార్గంలో పయనిస్తాయి. ఋణం ఏ కొంతైనా తీరుస్తారు. విద్యార్థునులకు తోటివారి కారణంగా సమస్యలు తలెత్తుతాయి.