బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (09:53 IST)

అవయవ దానం చేసిన బుడ్డోడు... కిడ్నీ, కాలేయాన్ని...

Boy
Boy
రెండు కిడ్నీలను ఐదేళ్ల బాలుడికి, ఆరు నెలల బాలికకు కాలేయాన్ని దానం చేశాడు ఓ బుడ్డోడు. తద్వారా ఎయిమ్స్‌లో 16 నెలల ఓ బాలుడు అవయవ దానం చేసి అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. విధి ఒక్కోసారి విపరీత పరిణామాలను ఎదుర్కొనేలా చేస్తుందనేందుకు ఈ బాలుడి కథే ఉదాహరణ. 
 
ఢిల్లీలోని జమునా పార్క్‌కి చెందిన 16 నెలల రిషాంత్ అనే బాలుడు అప్పుడప్పుడే అడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు. ఇంతలోనే కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. 
 
ఈ ఘటన ఆగస్టు 17న జరిగింది. వృత్తిరిత్యా ఓ ప్రైవేటు కాంట్రాక్టర్‌గా పనిచేస్తోన్న ఆ బాలుడి తండ్రి సమాచారం తెలుసుకున్న వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 
 
బాలుడి తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబసభ్యులు రిషాంత్‌ను ఎయిమ్స్‌లో చేర్పించారు. అనంతరం ఆగస్టు 24న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ బాలుడి కుటుంబం శోకసంద్రంలోకి మునిగిపోయింది.