ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్‌కు దూరమైన రవీంద్ర జడేజా
భారత క్రికెట్ జట్టులో రవీంద్ర జడేజా ఎంతో కీలకమైన ఆటగాడు. ఈ ఆల్‌రౌండర్ ఇపుడు ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. ఈ టోర్నీ వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరుగనుంది. అయితే, మోకాలికి ఆపరేషన్ కారణంగా జడేజీ ఈ టో్ర్నీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, జడేజాకు ఏ విధంగా గాయం ఏర్పడిందన్న విషయం ఇపుడు వెలుగులోకి వచ్చింది. దీంతో అతనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేశాడు.
జడేజాకు గాయం ఎలా తగిలిందంటే.. ఆసియా కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు దుబాయ్‌లో ఓ స్టార్ హోటల్‌లో బస చేసింది. ఖాళీ సమయంలో దుబాయ్ సముద్ర జలాల్లో జలక్రీడలకు రవీంద్ర జడేజా వెళ్లి గాయపడ్డాడు. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్‌లో స్కీబోర్డు జలక్రీడను ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన జడేజాకు మోకాలుకు దెబ్బ తగిలింది. ఆ గాయం తీవ్రమైనది కావడంతో జడేజా ముంబైకి వచ్చి ఆపరేషన్ చేయించుకున్నాడు.
ఈ విషయం తెలిసిన బీసీసీఐ జడేజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవైపు ఆసియా కప్ జరుగుతుండగా, మరికొన్ని రోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరగాల్సివుంది. ఇలాంటి తరుణంలో జలక్రీడలు ఏంటని మండిపడుతోంది. మొత్తంమీద రవీంద్ర జడేజా స్వయంకృతాపరాధం వల్ల ఇపుడు ఆయన ఏకంగా టీ20 వరల్డ్ కప్ టోర్నీకి దూరం కావాల్సివచ్చింది.