శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (09:32 IST)

యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్న సానియా మీర్జా

sania mirza
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగారు. గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. 
 
రెండు వారాల క్రితం కెనడాలో ఓ మ్యాచ్ ఆడుతున్న సమయంలో తన మోచేతికి గాయమైందని, స్కానింగ్ చేసిన తర్వాతే ఈ గాయం తీవ్రత తెలియలేదని వివరించింది. 
 
అందువల్ల కొన్ని వారాల పాటు ఆటకు కానున్నానని, ఇందులోభాగంగా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు. అదేసమయంలో గాయం కారణంగా తన రిటైర్మెంట్ ప్రణాళికలు కూడా మారే అవకాశం ఉన్నట్టు సానియా మీర్జా తెలిపారు.