గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (13:34 IST)

పగ పగ పగ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షోకు నిర్మాతల సంచలన నిర్ణయం

Paga Paga Paga poster
Paga Paga Paga poster
ఏ సినిమాకైనా మొదటి రోజు మొదటి ఆట ఎంతో ముఖ్యం. మౌత్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రాలెన్నో ఉన్నాయి. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోను ఉచితంగా వేస్తున్నారంటే.. సినిమా మీద ఎంత నమ్మకం ఉండాలి. ఇప్పుడు పగ పగ పగ సినిమా యూనిట్ కూడా అదే నమ్మకంతో ఉన్నట్టుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం పగ పగ పగ. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా పగ పగ పగ చిత్రం రాబోతోంది. వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించారు. నిర్మాత సత్య నారాయణ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.
 
ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్‌, మూవీ మోషన్ పోస్టర్‌, కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రం మీదున్న నమ్మకంతో నిర్మాతలు ఓ ధైర్యవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో అందరికీ ఫ్రీగా చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ డేరింగ్ స్టెప్‌తో ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు ఆశ్చర్యపోతోన్నాయి. అయినా కూడా సినిమా మీదున్న నమ్మకంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు తెలిపారు.
 
ఈ చిత్రంలో బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కోటి అందించారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా నవీన్ కుమార్ చల్లా, ఎడిటర్‌గా పాపారావు వ్యవహరించారు. రామ్ సుంకర ఫైట్ మాస్టర్‌గా పని చేశారు.