బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (17:08 IST)

బిగ్‌‌బాస్‌ సీజన్ 6.. మూడో వారం.. నామినేషన్.. ఒకటే అరుపులు

Bigg boss
బిగ్‌‌బాస్‌ సీజన్ 6 మూడోవారం నడుస్తుంది. ఇప్పటికే ఇద్దరిని హౌస్ నుంచి బయటికి పంపేసారు. ఇక మూడో వారం నామినేషన్స్ నిర్వహించాడు బిగ్ బాస్. హౌస్‌లోనుంచి షాని, అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యారు. వీకెండ్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అందరికి సరిగ్గా ఆడట్లేదు అని గట్టిగానే క్లాస్ పీకాడు నాగార్జున. దీంతో అందరూ అలర్ట్ అయ్యారేమో నామినేషన్స్‌లో గొడవలు, అరుచుకోవడాలు చేశారు. వదిలితే కొట్టేసుకునేలా ఉన్నారు.
 
ఇక నామినేషన్ల ప్రక్రియలో ఒక్కో కంటెస్టెంట్ ఇద్దర్ని నామినేట్ చేసి వాళ్ళ ముఖానికి రంగు పూయాలి. వారిని ఎందుకు నామినేట్ చేశారో చెప్పాలి. అయితే ఇందులో చాలా మంది సిల్లీ రీజన్స్ చెప్పారు.
 
మొదట శ్రీసత్య.. ఆరోహి, ఇనయాలను నామినేట్‌ చేసింది. సిల్లీ రీజన్స్‌తో నామినేట్‌ చేశావని ఇనయా ఫైర్‌ అయ్యింది. గీతూ.. సరిగ్గా ఆడట్లేదని సుదీప, చంటిలను నామినేట్‌ చేయగా, సుదీప, గీతూల మధ్య పెద్ద గొడవే జరిగింది. చంటి.. గీతూ, రేవంత్‌లను నామినేట్‌ చేశాడు. దీంతో మళ్ళీ గీతూ చంటితో గొడవ పెట్టుకుంది.
 
ఇనయా.. గీతూ, రేవంత్‌లను నామినేట్‌ చేయగా, మళ్ళీ గీతూ ఇనయాతో గొడవ పెట్టుకుంది. ఆదిరెడ్డి.. ఇనయా, వాసంతిలను నామినేట్‌ చేశాడు. దీనికి వాసంతి నువ్వు సరిగా ఆడు అనడంతో ఆదిరెడ్డి గట్టిగట్టిగా అరిచాడు.
సుదీప.. గీతూ, శ్రీహాన్‌లను నామినేట్‌ చేసింది.
 
బాలాదిత్య.. ఆరోహి, రేవంత్‌లను నామినేట్ చేశాడు.
వాసంతి.. ఆదిరెడ్డి, నేహాలను నామినేట్ చేయగా మళ్ళీ ఆదిరెడ్డి ఫైర్ అయ్యాడు.
మరీనా, రోహిత్ కలిసి.. రేవంత్‌, పైమాలను నామినేట్ చేసింది.
ఆర్జే సూర్య.. రేవంత్‌, బాలాదిత్యలను నామినేట్ చేశాడు.
కీర్తి.. ఆరోహి, చంటిలను నామినేట్ చేసింది.
నేహా.. వాసంతి, గీతూలను నామినేట్ చేయగా మళ్ళీ గీతూ గొడవ పెట్టుకుంది.
అర్జున్‌.. ఆరోహి, శ్రీహాన్‌ లని నామినేట్ చేశాడు.
పైమా..రోహిత్‌, బాలాదిత్యలను నామినేట్ చేసింది.
శ్రీహాన్‌.. ఇనయా, అర్జున్‌లను నామినేట్ చేశాడు.
ఆరోహి.. శ్రీ సత్య, బాలాదిత్యలను నామినేట్ చేసింది.
రాజ్‌ శేఖర్‌.. ఆరోహి, బాలాదిత్యలను నామినేట్‌ చేశాడు.