శనివారం, 9 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (14:31 IST)

బిగ్ బాస్ ఆరో సీజన్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఆ ఇద్దరు రెడీ..

biggboss
biggboss
బిగ్ బాస్ ఆరో సీజన్ 21 మంది హౌస్ మేట్స్ వున్నారు. హౌస్‌లోని ఇద్దరు కపుల్స్ గేమ్ కూడా ఇద్దరూ కలిసే ఆడుతున్నారు. ఎవరి గేమ్ వాళ్లు ఆడట్లేదు. టాస్క్ వచ్చినా కూడా ఇద్దరిలో ఒకరు మాత్రమే పార్టిసిపేట్ చేయాలని బిగ్ బాస్ క్లియర్‌గా ఆదేశిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఇంతమంది హౌస్‌లో ఉంటే.. రెండోవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడట బిగ్ బాస్.
 
యాంకర్‌గా, మోడల్‌గా మంచి పేరు తెచ్చుకున్న దీపిక పిల్లి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి వెళ్లబోతోందని సమాచారం తెలుస్తోంది. అయితే, ఈ సీజన్‌లో బిగ్ బాస్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మరో పార్టిసిపెంట్‌గా తన్మయిని కూడా హౌస్ లోకి పంపించే అవకాశం ఉంది. 
 
ఇప్పుడు ఇద్దరినీ హౌస్‌లోకి పంపిస్తే 23మంది వరకూ అయిపోతారు. అందుకే, బిగ్ బాస్ టీమ్ ఆలోచనలో పడింది. ఒకరిని ఈ వారం, మరొకరిని వచ్చేవారం పంపించాలని ప్లాన్ చేస్తోందట.
 
ఫస్ట్ నుంచీ కూడా బిగ్ బాస్ సీజన్-6కి దీపిక పేరు వివిపిస్తూనే ఉంది. అంతేకాదు, జబర్ధస్త్ టీమ్‌లో ట్రాన్స్ జెండర్ అయిన తన్మయిని కూడా పంపించాలని అనుకున్నారు. దీపికా పిల్లి, తన్మయి ఇద్దరూ ఒకేసారి హౌస్ లోకి వస్తారా ? లేదా బిగ్ బాస్ వేరే విధంగా వీరిని ఉపయోగిస్తూ హౌస్ లోకి పంపిస్తాడా అనేది ఆసక్తికరం.
 
ఇకపోతే.. ఆదివారం గేమ్‌లో మొదటగా "స్టార్‌ ఆఫ్‌ ది వీక్" అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఈ గేమ్‌లో మొదటి వారం కెప్టెన్‌గా ఎన్నికైన బాలాదిత్య ఎక్కువ సమాధానాలు కరెక్ట్‌గా చెప్పి విన్నర్‌గా నిలిచాడు. దీంతో బాలాదిత్యకి బిగ్‌బాస్ ఓ గిఫ్ట్‌ని పంపించాడు. 
 
అలాగే ఈ టాస్క్‌లో హౌస్‌లో ఉన్న అమ్మాయిల గురించి చెప్పమనగా బాలాదిత్య ఒక్కఒక్కరికి ఒక్కో పేరు ఇచ్చాడు. మరీనా బుట్టబొమ్మ అని, గీతూ రాయల్‌ సీతమ్మ అని, శ్రీ సత్య పువ్వు అని, ఆరోహి థౌజండ్‌ వాలా అని, వాసంతి బ్యూటిపుల్‌ అని, నేహా స్ప్రింగ్‌ అని, ఫైమా ఎంటర్ టైనర్‌ అని చెప్పాడు.
 
ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో "ఐటమ్‌ నంబర్" గేమ్‌ ఆడించాడు నాగార్జున. ఓ వస్తువును చూపిస్తే ఆ వస్తువుతో వచ్చే పాట ఏంటో కంటెస్టెంట్స్‌ చెప్పాలి. ఈ గేమ్ కోసం ఇంటిసభ్యులని ఏ, బీ అని రెండు టీమ్‌లుగా విభజించాడు. 
 
ఏ టీమ్‌లో చంటి, శ్రీసత్య, రేవంత్‌,నేహా, అభినయ, అర్జున్‌, మెరీనా అండ్‌ రోహిత్‌, కీర్తి, షానీ, ఇనయా ఉండగా మిగిలిన వాళ్ళు బీ టీమ్‌లో ఉన్నారు. ఈ ఆటలో ఏ టీమ్‌ సభ్యలు విజయం సాధించారు. ఎలిమినేషన్ లేకపోవడంతో మళ్ళీ నేడు సోమవారం నుంచి బిగ్‌బాస్ హౌస్ లో 21 మంది గోల తప్పదు.