1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Bigg Boss Telugu 6 update, September 10

బిగ్ బాస్ సీజన్-6.. గీతూకు పొగరెక్కువ.. ఉంచుతారా? పంపుతారా?

Bigg Boss Telugu 6 update
geethu royal
బిగ్ బాస్ ప్రారంభమై వీకెండ్ చేరుకుంది. ఇప్పటివరకు జరిగిన టాస్క్‌లు, గొడవలు అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ ఎవరనే దానిపై క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు స్లాంగ్‌లో ఒకింత రెచ్చిపోతోంది బిగ్ హౌస్‌లో గీతూ రాయల్. "నేను ఇలాగే వుంటా.." అంటూ ఆమె చేసే కామెంట్స్ అంతా ఇంతా కాదు. పేరులో వున్న 'రాయల్' అనేది, ఆమె పద్ధతిలో కనిపించడంలేదంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.  
 
ఇదిలా వుంటే, గీతూ రాయల్‌ని ముందుగా హౌస్ నుంచి పంపెయ్యాలనీ, లేకపోతే అదొక బజారు షోగా మిగిలిపోతుందనీ నెటిజన్లు విమర్శిస్తుండగా, ఇప్పట్లో గీతూ బయటకు వెళ్ళేది లేదనీ, ఆమెకు బలమైన 'స్పెషల్' సపోర్ట్ వుందనీ అంటున్నారు.
 
కనీసం ఐదారు వారాల వరకూ గీతూ రాయల్‌కి ఎలాంటి ఇబ్బందీ వుండదా.? అంటే, ఔననే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎంత నెగెటివిటీ ఓ కంటెస్టెంట్ మీద పెరిగితే, అంతలా ఆ కంటెస్టెంట్‌ని హౌస్‌లో వుంచుతారు. గీతూకి అదే చెప్పి హౌస్‌లోకి నిర్వాహకులు పంపించారట.
 
హౌస్‌లో గీతూ తప్ప ఇంత ఆటిట్యూడ్ ఇంకెవరూ చూపించడంలేదు. నిజానికి, అది ఆటిట్యూడ్ కాదు, పొగరనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కృష్ణంరాజు చనిపోవడానికి కారణం ఇదేనట.. వైద్యుల వెల్లడి