గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (13:12 IST)

చచ్చినా నేను బిగ్ బాస్ షోకు వెళ్లను.. సింగర్ స్మిత

smita
బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యింది. ఆదివారం ప్రారంభమైన ఈ షోలో పాల్గొనే వారిపై పేర్లపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీరిలో సింగర్ స్మిత పేరు కూడా వినిపించింది. ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం గురించి సింగర్స్ స్మిత స్పందిస్తూ చచ్చినా నేను బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్ళను అంటూ బిగ్ బాస్ కార్యక్రమం పై షాకింగ్ కామెంట్స్ చేశారు. 
 
అయితే నేను వెళ్లడమే కాకుండా నాకు బాగా సన్నిహితులైన పరిచయం ఉన్నవారు ఈ కార్యక్రమానికి వెళ్తానని చెప్పినా వద్దనే సలహా ఇస్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
 
బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఈమె మాట్లాడుతూ నాకు ఈ కార్యక్రమం ఏమాత్రం నచ్చదని తెలిపింది. అందరినీ అలా హౌస్ లో వేసి కొట్టుకోమని టాస్క్ ఇవ్వడం ఏంటో నాకు అర్థం కాదని చెప్పింది. దీంతో బిగ్ బాస్ షోపై సింగర్స్ స్మిత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారుతున్నాయి.