ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (11:32 IST)

బిగ్‌బాస్‌లోకి సింగర్ రేవంత్: రియాల్టీ షోకు కౌంట్ డౌన్ ప్రారంభం

Revanth
Revanth
పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్‌ 4 నుంచి ప్రారంభం కానుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వారి జాబితా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సింగర్స్‌ కేటగిరీలో రేవంత్‌ సెలక్ట్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఓ ఫీమేల్‌ సింగర్‌ను కూడా రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. 
 
బుల్లెట్టు బండితో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయిన సింగర్‌ మోహన భోగరాజు ఈ రియాలిటీ షోలోకి పంపించాలని బిగ్‌బాస్‌ యాజమాన్యం భావిస్తోందట. ఆమెను నేరుగా షో ప్రారంభంలోనో లేదా వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారానైనా లోనికి పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. 
 
ఈ ద‌ఫా బిగ్‌బాస్ షోలో మొత్తం 19 మంది క‌నిపించ‌నున్నారు. వీరిలో బుల్లితెర దంపతులు రోహిత్‌-మెరీనా అబ్రహం కూడా ఉన్నార‌ని స‌మాచారం. అలాగే సింగ‌ర్ రేవంత్‌, అర్జున్ క‌ల్యాణ్‌, నువ్వు నాకు న‌చ్చావ్ సుదీప‌, చ‌లాకీ చంటి, న‌టుడు శ్రీ‌హాన్‌, నేహా చౌద‌రి త‌దిత‌రులు వెళ్ల‌నున్నారు. వీళ్లంతా వెండితెర‌పై ఇష్టాన్ని పెంచుకుని కెమెరా ముందుకు వెళ్లిన వారే.