గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (12:38 IST)

ప్రముఖ సింగర్‌ వైశాలి బల్సారా అనుమానాస్పద మృతి

Vaishali Balsara
Vaishali Balsara
ప్రముఖ సింగర్‌ వైశాలి బల్సారా అనుమానాస్పద రీతిలో మృతిచెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. గుజరాత్​లోని వల్సాద్ జిల్లాలో ప్రముఖ గాయని వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పద రీతిలో ఓ కారులో లభ్యమైంది. పార్‌ నదీ ఒడ్డున కారు చాలాసేపు ఆగి ఉండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు డోర్‌ లాక్‌ ఓపెన్‌ చేసి చూడగా ‍బ్యాక్‌ సీట్లో ఓ మృతదేహం కనిపించింది. అది గాయని వైశాలి బల్సారాగా పోలీసులు గుర్తించారు. 
 
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా వైశాలి భర్త హితేశ్‌ కూడా సింగరే. ఇద్దరూ కలిసి పలు స్టేజ్‌ షోల్లో పాల్గొన్నారు. 
 
సింగర్‌ వైశాలి అనుమానాస్పద మృతి వెనుక ఎవరి హస్తం ఉందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా సింగర్‌ వైశాలి మృతి పట్ల సినీ ప్రముఖులు సహా నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.