గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (23:26 IST)

మూఢ నమ్మకాలు వీడి నేత్రదానం చేయండి : దర్శక నటుడు ఆర్జే.బాలాజీ

rj balaji dr agarwal hospital
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ నేత్ర చికిత్సాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ 1957 నుండి ఐకేర్‌ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆస్పత్రి తాజాగా చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో అత్యాధునిక కంటి సంరక్షణ ఆసుపత్రిని ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోలీవుడ్ సినీ నటుడు ఆర్జే బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నేత్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధికార డీఎంకేకు చెందిన పల్లావరం ఎమ్మెల్యే ఐ.కరుణానిథి, పల్లావరం జోన్ ఛైర్మన్ జోసెఫ్ అన్నాదురై, సీనియర్ ఆప్తాల్మాలజిస్ట్ అండ్ రీజినల్ హెడ్, క్లినికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీనివాసన్ జి రావు, డాక్టర్ అగర్వాల్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్, క్లినిక్ హెడ్ డా.ఎస్. వెంకటేష్ ‌తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ ఆస్పత్రిని దాదాపు 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పారు. ఇది క్రోమ్‌పేట్ బస్టాప్ వెనుక 201, 1వ అంతస్తు, జీఎస్టీ రోడ్డులో ప్రతి ఒక్కరికీ అందుబాటులో స్థాపించారు. ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 30వ తేదీ వరకు ఉచిత ఐ కన్సల్టేషన్ అందుబాటులో ఉంటుందని డాక్టర్ ఎస్. వెంకటేష్ వెల్లడించారు.
rj balaji dr agarwal hospital
 
ఈ సందర్భంగా నటుడు ఆర్‌జే బాలాజీ మాట్లాడుతూ.. క్రోమ్‌పేటలో డాక్టర్‌ అగర్వాల్‌ కంటి ఆసుపత్రి నూతన సౌకర్యాన్ని ప్రారంభించి, తాను నేత్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మనిషికి నేత్రాలు అత్యంత ముఖ్యమైనవన్నారు. వీటిని ప్రతి ఒక్కరూ దానం చేయాలని కోరారు. ఒక జత కళ్ళతో నలుగురికి నేత్రదానం ప్రసాదించవచ్చని వైద్యులు చెబుతున్నారని వెల్లడించారు. అందువల్ల మరణానంతరం మన కళ్లను దానం చేయడం ద్వారా అనేక మంది చూపులేని వారికి దృష్టిని తిరిగి తీసుకురావడం సాధ్యమవుతుందన్నారు. అందుకే తాను నేత్రదానం చేస్తున్నట్టు ప్రతిజ్ఞాపత్రంపై సంతకాలు చేసినట్టు తెలిపారు. మూఢ నమ్మకాలను విడనాడి ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
 
అలాగే, డాక్టర్ అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్‌లో సీనియర్ నేత్ర వైద్య నిపుణుడు, ప్రాంతీయ అధిపతి (క్లినికల్ సర్వీసెస్) డాక్టర్ శ్రీనివాసన్ జి రావు మాట్లాడుతూ, "మేము క్రోమ్‌పేటలో మా అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించడం చాలా గర్వంగా ఉంది. ప్రస్తుతం మాకు చెన్నైలో 18 కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రం ప్రారంభోత్సవంతో డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ ఇప్పుడు భారతదేశం, ఆఫ్రికా అంతటా 119 ఆసుపత్రుల యొక్క మొత్తం నెట్‌వర్క్ ఉనికిని కలిగి ఉంది. పెరుగుతున్న కంటి సంరక్షణ డిమాండ్‌లను మెరుగ్గా తీర్చడానికి మా నెట్‌వర్క్, మరియు కార్యకలాపాలను విస్తరించడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా ప్రణాళిక 2022-23 నాటికి నెట్‌వర్క్‌లోని ఆసుపత్రుల సంఖ్యను 150కి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.  
 
అంతేకాకుండా, నేత్రదానంపై అవగాహన కల్పించడానికి, మరణానంతరం వారి కళ్లను దానం చేసేలా ప్రతిజ్ఞ చేసేలా ప్రజలను ప్రేరేపించడానికి ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన వారోత్సవాన్ని పాటిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచంలోని దృష్టిలోపం ఉన్న జనాభాలో మూడింట ఒకవంతు మంది దృష్టి లోపం ఉన్న 12 మిలియన్ల మంది వ్యక్తులు భారతదేశంలో ఉన్నారని గుర్తుచేశారు.
rj balaji dr agarwal hospital
 
కంటిశుక్లం, గ్లాకోమా తర్వాత అంధత్వానికి కార్నియల్ వ్యాధులు ప్రధాన కారణాలు. అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు తమ కళ్లను దానం చేయకుండా అడ్డుకుంటున్నారు. లింగం, వయస్సు లేదా రక్త సమూహంతో సంబంధం లేకుండా ఎవరైనా మరణించిన తర్వాత తమ నేత్రాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయొచ్చని ఆయన తెలిపారు. 
 
అలాగే, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ క్లినిక్ సర్వీసెస్, హెడ్ డాక్టర్ ఎస్. వెంకటేష్, మాట్లాడుతూ, 'కొత్త ఆసుపత్రిలో మాడ్యులర్ ఓటీ, ప్రెసిషన్ క్యాటరాక్ట్, రెటీనా ఓటీ వంటి సరికొత్త ఆపరేషన్ సౌకర్యాలను అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో ల్యాబ్‌లు, ఫార్మసీ, అధిక నాణ్యత కలిగిన ప్రముఖ బ్రాండ్‌ల కంటి అద్దాల విస్తృత శ్రేణి ఫ్రేమ్‌లు, లెన్స్‌లను అందించడానికి ఆప్టికల్ వింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.