శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

టాలీవుడ్ దర్శకుడు బాబీకి పితృ వియోగం

ksravindra
తెలుగు చలనచిత్ర దర్శకుడు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ ఇంటి విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మోహన్ రావు (69) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన ఇటీవల అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 
 
ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన ఏపీలోని గుంటూరు జిల్లా నగరంపాలెంకు తరలించి, సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దర్శకుడు బాబీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో "సర్దార్ గబ్బర్ సింగ్" అనే చిత్రంతో పాటు పలు చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించే పనిలో నిమగ్నమైవున్నారు.