రవితేజకు హ్యాండ్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజ రవితేజకు మెగాస్టార్ చిరంజీవి హ్యాండ్ ఇచ్చారు. అదెలాగంటే, ఈరోజు హైదరాబాద్ శివార్లో మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా షూట్ జరుగుతోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కడికి శనివారం నాడు లంచ్ గేప్‌లో నల్లటికారులో రవితేజ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కార్‌వాన్‌ను దగ్గరగా వచిన రవితేజ కార్‌వాన్ డోర్ కొడుతూ, హయ్.. అన్నయ్యా.. అంటూ ఆప్యాయ పలుకరింపుతో.. హాయ్ బ్రదర్ వెల్‌కమ్.. అంటూ కలర్‌ఫుల్ చొక్కా వేసుకున్న ఓ చేయి లోపలికి తీసుకెళ్ళుతుంది. ఆ వెనుకే వున్న దర్శకుడు బాబీ.. మెగా మాస్ కాంబో బిగిన్స్ అంటూ.. కామెంట్ చేశాడు. ఈరోజు శుభసూచకంగా మెగాస్టార్, రవితేజ కలయిక జరిగింది. చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. మాస్ మహరాజా జాయిన్ మెగా 154 అనే టైటిల్‌తో చిన్న వీడియో విడుదలైంది.
ఇదిలా వుండగా, రవితేజ నటిస్తున్న తాజా సినిమా `రామారావు ఆన్ డ్యూటీ`. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఈరోజు ట్రైలర్ విడుదల కాబోతుంది. శనివారం సాయంత్రం 7గంటల తర్వాత హైదరాబాద్‌లోని పార్క్ హోటల్‌లో జరగున్ను ఈ వేడుకకు రవితేజ, మెగాస్టార్‌ను ఇలా ఆహ్వానం పలికారు. ఈ చిన్నవీడియో మెగా అభిమానుల్ని ఫిదా చేసింది.