మెగాస్టార్ దూకుడు - "వాల్తేరు వీరయ్య"గా చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మంచి దూకుడు మీదున్నారు. ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లలోకి "ఆచార్య"గా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగా తనయుడు రాం చరణ్ కూడా నటించారు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అబౌ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఇపుడు "ఆచార్య" సంగతి పక్కనబెడితే చిరంజీవి తన కొత్త చిత్రం టైటిల్‌ను లీక్ చేశారు. బాబీ దర్శకత్వంలో నటించనున్నారు. మెగా 154 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రానికి "వాల్తేరు వీరయ్య" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వెల్లడించారు.
విశాఖపట్నం నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో మెగాస్టార్ మాస్ రోల్‌లో కనిపించబోతున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైన్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్. ఇందులో మరో హీరో రవితేజ కూడా కీలక పాత్రను పోషించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఇదిలావుండగా, చిరంజీవి చేతిలో ఇపుడు 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' చిత్రాలు ఉన్నాయి. వీటిలో 'గాడ్ ఫాదర్' ఈ యేడాదే విడుదలకానుంది.