సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (16:08 IST)

"ఆచార్య" మూవీకి మిశ్రమ స్పందన : నెట్టింట్ ట్రోల్స్

Chiranjeevi, Acharya
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఈ నెల 29వ తేదీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కొరటాల శివ దర్శకుడు కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, చిత్రం విడుదలైన తర్వాత మిశ్రమ టాక్ వచ్చింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 
 
ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్‌లు పూర్తి స్థాయిలో కలిసి నటించారు. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రం రికార్డులను తిరగరాయడం ఖాయమని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నప్పటికీ మరోవైపు సినిమాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. డైరెక్టర్ కొరటాల శివ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేనదని ట్రోల్స్ వస్తున్నాయి. రాజమౌళి సినిమా తర్వాత రాంచరణ్‌కు ఫ్లాప్ వచ్చిందని విమర్శలు వచ్చాయి.