గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (10:45 IST)

కాస్ట్యూమ్ స్టయిలిస్ట్‌పై బాలీవుడ్ గాయకుడు అత్యాచారం.. కేసు

rahul jain
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన గాయకుడు, కంపోజర్ రాహుల్ జైన్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ చిత్ర పరిశ్రమకు చెందిన మహిళా కాస్ట్యూమ్ స్టయిలిస్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై రాహుల్ జైన్ అత్యాచారం చేశారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సింగర్పై ఐపీసీ సెక్షన్ 376, 323, 506 కింద కేసులు నమోదు చేశారు. 
 
ముంబైకు చెందిన 30 ఏళ్ల కాస్ట్యూమ్ స్టయిలిస్ట్‌ ఇచ్చిన ఫిర్యాదులో తన పనిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మెచ్చుకుంటూ... ఒకసారి తన ఫ్లాట్‌కు రమ్మని రాహుల్ ఆహ్వానించాడని... తనను పర్సనల్ కాస్ట్యూమ్ స్టయిలిస్టుగా నియమించుకుంటానని చెప్పాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. 
 
ఆ తర్వాత ఆయన ఆహ్వానం మేరకు ఫ్లాట్‌కు వెళ్లిన తనను బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తెలిపింది. తాను ప్రతిఘటించినప్పటికీ బలవంతంగా అత్యాచారం చేశాడని... సాక్ష్యాలను తొలగించాడని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదుతో రాహుల్ జైన్పై పోలీసులు సెక్షన్ 376, 323, 506 కింద కేసు నమోదు చేశారు. 
 
మరోవైపు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని రాహుల్ జైన్ తెలిపాడు. గతంలో కూడా మరో మహిళ తనపై అత్యాచారం కేసు పెట్టిందని చెప్పాడు. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది అక్టోబర్ లో ఓ మహిళ రాహుల్ జైన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. 
 
తనపై అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడని, ఆ తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను రాహుల్ జైన్ కొట్టిపారేశారు. తనపై ఉద్దేశపూర్వంగానే అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు.